
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లోకి కొత్త జూనియర్ లెక్చరర్లు(జేఎల్) రానున్నారు. ఇంటర్ కాలేజీల్లో 1,292 పోస్టులు, పాలిటెక్నిక్ కాలేజీల్లో 240 పోస్టులను భర్తీ చేయనున్నారు. టీజీపీఎస్సీ ఆయా పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించి, ఫలితాలు రిలీజ్ చేసింది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో నియామక పత్రాలు పంపిణీ నిలిచిపోయింది. కోడ్ ముగియడంతో అభ్యర్థులకు రవీంద్ర భారతిలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు.