మాజీ సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ" అంటూ తారక్ ట్వీట్ చేశారు.
ఇక నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో శతజయంతి వేడుకలను ప్రారంభించారు. నిన్న సాయంత్రమే నిమ్మకూరు చేరుకున్న బాలయ్య ఈ ఉదయం గ్రామంలోని దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం తన తండ్రి-తల్లి విగ్రహాలకు నివాళి అర్పించారు. అదేవిధంగా తెనాలి వెళ్లనున్న బాలయ్య అక్కడ పెమ్మసాని థియేటర్ లో ఏడాది పాటు ప్రదర్శించే ఎన్టీఆర్ సినిమాలను ప్రారంభించనున్నారు.
సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP
— Jr NTR (@tarak9999) May 28, 2022