దేవర.. పవర్ఫుల్ పోస్టర్ వచ్చేసింది

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర.  ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్  వేయికళ్లతో ఈ సినిమా కోసం  వెయిట్ చేస్తున్నారు.  తాజాగా దసరా పండుగను పురస్కరించుకుని మేకర్స్  కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్  చేతిలోని ఆయుధంపైనే ఫోకస్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను వదిలారు.  ఈ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.  

Also Read :- దమ్ముంటే కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలి

జనతా గ్యారేజ్ తరువాత  కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది.  రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన  జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తు్న్నాడు.  ఈ సినిమాను  2024 ఏప్రిల్  5న రిలీజ్ చేయనున్నారు.  సముద్రతీరంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు.