
ఒంగోలు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. 'అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే' అంటూ ఒంగోలులోని ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందురు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓ వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోన్న సమయంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం కలకలం రేపుతున్నాయి. అయితే వీటిని ఎవరు ఏర్పాటు చేశారో అని లోకల్ టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు వెలవడం ఇదేం కొత్తకాదు. గతంలో కూడా చూశాం. అయితే ఈసారి లోకేష్ ని రెచ్చగొట్టేలా అందులో స్లోగన్లు రాయడంతో ఇది వైసీపీ పనే అని అంటున్నారు టీడీపీ నేతలు. ‘‘అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే’’ అంటూ లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు వేశారని అంటున్నారు. మరోవైపు యువగళం పాదయాత్ర 157వరోజు కొండేపి నియోజకవర్గంలో కొనసాగింది. మాలెపాడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు లోకేష్.