స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్(Mallik Ram) తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మార్చి 29న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమా సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక సినిమాలో టిల్లు పాత్రలో సిద్దు నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. థియేటర్స్ లో టిల్లన్న మాస్ జాతారకు కలెక్షన్స్ మోట మోగిపోతోంది. కేవలం మూడురోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. పదిరోజుల్లో ఏకంగా రూ.90 కోట్లకు పైగా రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
An ultimate guest for the superlative blockbuster celebrations!
— Sithara Entertainments (@SitharaEnts) April 6, 2024
𝑴𝑨𝑵 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 @tarak9999 garu to grace the 𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐁𝐥𝐨𝐜𝐤𝐛𝐮𝐬𝐭𝐞𝐫 Celebrations of #TilluSquare on April 8th! 🥳❤️#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani… pic.twitter.com/yy72UpkrXb
also read : Dil Raju: నా పెళ్లి, భార్య విషయంలో కూడా ట్రోల్ అయ్యాను.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
కాగా.. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఈ విషయంపై తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ ఈవెంట్ ఏప్రిల్ 8న జరుగనుంది. ఎక్కడ విశేషం ఏంటంటే.. ఈ ఈవెంట్ కు మాస్ గాడ్, మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. దీంతో ఈ న్యూస్ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే.. టిల్లు స్క్వేర్ మూవీ ఎన్టీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. దానికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు వచ్చిన అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.