
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామీలీ(Nandamuri Family)కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అదే హవా కొనసాగుతుంది. ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి ఫ్యాన్స్గా..ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం బాలకృష్ణ(Balakrishna) ఫ్యాన్స్గా, ఎన్టీఆర్(Jr Ntr) ఫ్యాన్స్గా డివైడ్ అయినట్లు కనిపిస్తోంది.
#JoharNTR ?? pic.twitter.com/4bd6RApbYq
— Jr NTR Fan Club (@JrNTRFC) August 28, 2023
ఇక రీసెంట్గా(ఆగస్టు 28న) మన తెలుగు ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూ.100 స్మారక నాణేంను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ ఈవెంట్లో రామారావు కూతురు దగ్గుబాటి పురందేశ్వరి, కొడుకు బాలకృష్ణతో పాటుగా పలువురు ఎన్టీఆర్ కుటంబ సభ్యులు అటెండ్ అయ్యారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్కు అటెండ్ కాకపోవడంతో సోషల్ మీడియాలో..బాలయ్య బాబుకు, ఎన్టీఆర్ మధ్య బిగ్ వార్ షురూ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. సీ.ఎన్టీఆర్కి ఎంతో ఇష్తమైన మనవడు తారక్ రాకపోవడంతో అందరు మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా గతంలో నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్లో..ఎక్కడ కూడా జూ.ఎన్టీఆర్ అటెండ్ కాకపోవడంతో స్టార్ట్ అయ్యింది ఈ వార్. ఇక ఎన్టీఆర్ నాణెం రిలీజ్ ఈవెంట్లో తారక్ లేకపోవడంతో గట్టిగానే షురూ అయ్యింది.
ALSO READ :పాపం పూజా హెగ్డేకు దెబ్బ మీద దెబ్బ.. ఐరన్ లెగ్ అంటూ ముద్ర..?
Late Shri #NandamuriTarakaRamarao ₹100 Coin:
— NTR Cult ™ (@NTRcultOfficial) August 27, 2023
The Specially minted coin is scheduled to be released at Rashtrapati Bhavan with President Droupadi Murmu leading the ceremony Tomorrow. Invitees include Jr NTR , Nara Chandrababu Naidu, Daggubati Purandeswari, Nandamuri Balakrishna pic.twitter.com/LsnWszVdw6
అలాగే జూ.ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య బాబుకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. తన తమ్ముడు తారక్ బాటలోనే కళ్యాణ్ రామ్ నడుస్తుండని మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక నందమూరి ఫ్యామిలీలో రాజకీయ సెగలు ముదిరాయాయని పలువురు సీనియర్ అనలిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు.
ఇక బాలయ్య ఫ్యాన్స్..ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో తెగ వార్ జరుగుతుంది. దీంతో నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ను..కూల్ చేయటానికి మార్గం ఎక్కడ కనబడకుండా పోయినట్టు తెలుస్తోంది. ఇక బాలయ్య..ఎన్టీఆర్ కలిసి కనిపిస్తే తప్ప,ఇప్పట్లో ఫ్యాన్స్ సెగలు చల్లారేలా కనిపిస్తలేదు.