Jr NTR Video: జీవితం అన్నిటికంటే విలువైనది.. గళం విప్పిన జూనియర్ ఎన్టీఆర్..

Jr NTR Video: జీవితం అన్నిటికంటే విలువైనది.. గళం విప్పిన జూనియర్ ఎన్టీఆర్..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ రహిత సమాజం (Drug -free Society కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకొస్తుంది. స్టార్ హీరోస్, హీరోయిన్స్ తమదైన వీడియోలతో అవగాహన పెంచుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)  తన వంతుగా గళం విప్పాడు. 

"మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. కానీ, కొంతమంది తాత్కాలిక ఆనందాల కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు. ఇది సహచరుల ప్రభావం వల్లనో.. స్టయిల్ అనో డ్రగ్స్ కి ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది.. రండి.. నాతో చేతులు కలపండి.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వాములు అవ్వండి.మీకు తెలిసి ఎవరైన డ్రగ్స్ అమ్మడం, కొనడం చేసిన వెంటనే తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నెంబర్ 8712671111 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి" అంటూ ఎన్టీఆర్ తెలిపారు. 

ఇప్పటికే మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి.. ప్రభాస్, అడవి శేష్, చిరంజీవి పలువురు స్టార్స్ మద్దతు తెలుపుతూ ఇచ్చిన సందేశం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలతో ఎంతోమంది డ్రగ్స్ కి దూరంగా ఉంటారనే ఇంపాక్ట్ ఇందులో ఉంది. #Say No to Drugs.