కామారెడ్డిటౌన్, వెలుగు : తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న సమ్మె కామారెడ్డి జిల్లాలో గురువారం కొనసాగింది. కామారెడ్డిలో శిబిరం వద్ద బతుకమ్మలతో నిరసన తెలిపారు. బీజేపీ నియోజక వర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేపీఎస్‌ల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కలిసి కట్టుగా పోరాడితో ప్రభుత్వం దిగొస్తుందని చెప్పారు. జేపీఎస్‌లు డ్యూటీలో చేరకుంటే తొలగిస్తామని మంత్రి హెచ్చరించడం ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమన్నారు.
.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ తేలు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, లీడర్లు ప్రవీణ్, నరేందర్, వేణు, రవి, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్ సిటీ, వెలుగు : నిజామాబాద్‌లో జేపీఎస్‌ల సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేశ్ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైందని విమర్శించారు. కార్యదర్శులు , ఐకేపీ వీవోఏలు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నల్వాల నరసయ్య , జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు, వివోఏల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.