రెగ్యులరైజ్ చేయాలి..నల్గొండలో పంచాయతీ కార్యదర్శుల ర్యాలీ

నల్గొండలో జూనియర్ పంచాయతీ కార్యదర్శలు కదం తొక్కారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎన్జీ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.  ఈ సందర్భంగా ప్రొబిషన్ పిరియడ్ 3 సంవత్సరాలు దాటినా..తమను  రెగ్యులరైజ్ చేస్తలేరని పంచాయితీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పెంచిన మరో ఏడాది ప్రొబిషన్ కాలం కూడా ముగిసిందని సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇచ్చిన హామీకి కట్టుబడి రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా రేగులరైజేషన్ కోసం 9వేలు పైబడి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎదురు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో 750 మంది పంచాయతీ జూనియర్ కార్యదర్శులు అర్హులుగా ఉన్నారని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తే.. టీ.ఏ, డీ.ఏ అలవెన్స్ లతో కలిపి వారి శాలరీ 20 శాతం పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.