వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ మండల్ రంగాపురంలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీ రంగు సోనీ ఆత్మహత్యచేసుకుంది.రంగాపురం కార్యాలయంలో పురుగుల మందు తాగిన ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందింది.
గత కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. రెండుమూడు రోజుల క్రితం జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అందరూ విధుల్లోకి తప్పనిసరిగా రావాలని ప్రభుత్వం ఆదేశించినప్పటి నుంచి ఆమె విధుల్లో చేరింది.
సోని ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.