డిసెంబర్ 9న లోక్ అదాలత్

డిసెంబర్ 9న లోక్ అదాలత్

వనపర్తి, వెలుగు: పెండింగ్  కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్  ఎంతగానో ఉపయోగపడుతుందని జూనియర్  ప్రిన్సిపల్ సివిల్  జడ్జి రవికుమార్  పేర్కొన్నారు. మంగళవారం వనపర్తిలో న్యాయవాదులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. 

జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు కక్షిదారులను ఒప్పించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న క్రిమినల్  కేసులపై దృష్టి పెట్టాలని కోరారు. డిసెంబర్ 9న వనపర్తి కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చూడాలన్నారు.