
హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో వివిధ విభాగాల్లో 96 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు పోస్టును అనుసరించి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష మే లేదా జూన్ లో నిర్వహించనున్నారు. వివరాలకు www.spphyderabad.spmcil.com వెబ్సైట్లో సంప్రదించాలి.