
లిమా (పెరు): ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు నేలవల్లి ముకేశ్ నాలుగో గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. ఏపీకి చెందిన ముకేశ్, రాజ్‌వర్దన్ పాటిల్, హర్సిమార్ సింగ్ రట్టాతో కలిసి మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ సాధించాడు. దాంతో ఈ టోర్నీలో ఇండియా నెగ్గిన స్వర్ణాల సంఖ్య 11కు చేరుకుంది.