Food News : మీ పిల్లలు ఇవి తింటే.. ఇక అంతే సంగతులు.. బీ కేర్ ఫుల్

Food News : మీ పిల్లలు ఇవి తింటే.. ఇక అంతే సంగతులు.. బీ కేర్ ఫుల్

రోడ్డు మీద వెళ్తున్నపుడు పానీపూరీ బండి కనిపిస్తే చాలు. ఆటోమేటిక్ గా నోరూరుతుంది. జంక్ ఫుడ్ హెల్దీ కాదని తెలిసినా, తినకుండా ఉండలేరు చాలామంది. అయితే జంక్ ఫుడ్ ను  ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. కానీ, రోజూ తింటేనే డేంజర్. యుకెలో ఒక అబ్బాయి ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కంటిచూపు, వినికిడి శక్తి కోల్పోయాడనే వార్త తెలిసే ఉంటుంది. జంక్ ఫుడ్ వల్ల అంత ప్రమాదమా?" అనుకుంటున్నారా? ఇంకా చాలా నష్టాలున్నాయి. జంక్ ఫుడ్ అనే పేరులోనే 'జంక్' ఉంది. 'జంక్' అంటే 'పనికిరానిది' అని అర్థం. 'జంక్ ఫుడ్' అంటే 'పోషక విలువలు తక్కువగా ఉండే ఆహారం' ఆ విషయం తెలిసి కూడా వాటినే తింటుంటారు చాలామంది. నోటికి రుచిగా ఉందని అదేపనిగా జంక్ తింటే ప్యూచర్ లో ఆరోగ్యం కూడా 'జంక్'లానే తయారవుతుంది. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అతిగా తింటే...

టేస్టీ పాల్స్, ఫ్యాట్స్, షుగర్స్ ఉండటం వల్ల జంక్ ఫుడ్ ను  ఒకసారి తింటే మళ్లి మళ్లీ తినాలనిపిస్తుంది. బాగుంది కదా అని ఎప్పుడూ ఈ ఫుడ్ తింటే మెదడు పనితీరులో మార్పులు చేస్తాయి. తినే తిండిలో పోషకాలు లేకపోతే శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మరి అలాంటిది జంక్ ఫుడ్స్ లో పోషకాలు చాలా తక్కువ, దాంతో శరీరానికి పోషకాలు అందక ఒత్తిడిగా అనిపిస్తుంది. ఆ ఒత్తిడి డిప్రెషన్ కి దారి తీస్తుంది. డిప్రెషన్ బారి నుంచి బయటపడేందుకు మళ్లీ జంక్ పుడ్డే తినాలనిపిస్తుంది. ఇలా తెలియకుండానే ఎంతో నష్టం చేస్తుంది జంక్ ఫుడ్.  

 దీన్ని అతిగా తింటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ కూడా పెరుగుతాయి. జంక్ ఫుడ్స్ నుంచి వచ్చే కొవ్వులు శరీరంలో పేరుకుపోయి.. ఊబకాయం. సమస్యను పెంచుతుంది. బరువు పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. జంక్ ఫుడ్ లో  ఎక్కువగా వేగించిన పదార్ధాలే ఉంటాయి. జంక్ ఫుడ్ లో  ప్రాసెస్ చేసిన ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే చెడు కొవ్వు, సోడియం రక్తపోటుని పెంచి మూత్రపిండాల పనితీరుని దెబ్బతీస్తాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.. సరైన పోషకాలు అందకపోతే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. లివర్, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది. జంక్ ఫుడ్ తినడానికి రుచిగానే ఉంటుంది. కానీ, అదే పనిగా తింటే జరిగే సష్టం మాత్రం తిరిగి పూడ్చలేనిది. అందుకే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఎదిగే పిల్లల ఆహారం. విషయంలో మరికాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి,

ALSO READ : Good Health : వీటిని ఇలా తీసుకుంటే అలసట దూరం.. నిద్ర కూడా బాగా పడుతుంది..!

పదిహేడేళ్లకే...

యుకెలోని 14 ఏళ్ల పిల్లలు  ఎక్కువగా అలసిపోతున్నాడు. 'మా అబ్బాయి చురుకుగా లేకుండా ఎందుకిలా ఉంటున్నాడ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఒక పిల్లాడి  తల్లిదండ్రులు. ఆ డాక్టర్ మెడికల్ టెస్టు చేసి... మీ అబ్బాయికి విటమిన్ B-12 లోపం, మాక్రోసైటిక్ రక్తహీనత ఉన్నాయని చెప్పారు. ట్రీట్ మెంట్ చేసి, B-12 ఇంజక్షన్లు ఇచ్చి పంపించారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ అబ్బాయికి 15 ఏళ్లు వచ్చాయి. దాంతోపాటు కంటిచూపు, వినికిడి సమస్యలు కూడా మొదలయ్యాయి. మళ్లీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు అతగాడి అమ్మానాన్నలు. ఎన్ని టెస్టులు చేసినా అసలు సమస్య ఏంటి అర్థం కాలేదు డాక్టర్లకు దాంతో అప్పటికీ ట్రీట్ మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు. రెండేళ్లు తిరిగే సరికి ఆ అబ్బాయికి 17 ఏళ్లు వచ్చాయి. వయసు పెరగడంతో పాటు కంటిచూపులో తేడా కూడా బాగా పెరిగింది. కంటిచూపు 20/200గా ఉంది.

 అంటే.. పూర్తిగా చూపు కోల్పోయినట్లే లెక్క. ఎందుకిలా జరిగిందని మళ్లీ టెస్ట్ చేశారు. అప్పుడు తెలిసింది. అ అబ్బాయి.. నాడీ వ్యవస్థ దెబ్బతిన్నదని..  కళ్లను... మెదడుకు అనుసంధానం చేసే నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అతను చూపు కోల్పోయాడు.  అలాగే అతని శరీరంలో విటమిన్ బి-12. కాపర్, సెలీనియం. విటమి న్- డి చాలా తక్కువ మోతాదులో ఉన్నట్లు గమ నించారు. దాంతో అనుమానం వచ్చిన డాక్టరు ఆ కుర్రాడు ఏం తింటున్నాడో తెలుసుకున్నారు. అప్పుడు అర్థమైంది వాళ్లకు అతడి కంటి చూపు, వినికిడి శక్తి కోల్పోవడానికి కారణం..  అతను తిన్న, తింటున్న జంక్ ఫుడ్ అని.. ఆ  అబ్బాయి చిన్నప్పటి నుంచీ వండ్లు, కూరగాయ లను తినేందుకు అస్సలు ఇష్టపడేవాడు కాదట.  రోజూ ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రెడ్, చిప్స్, ప్యాక్డ్ చికెన్, హ్యామ్ మాత్రమే తినేవాడట.
 
ఉదయం టిఫిన్ నుంచి మొదలు రాత్రి భోజనం వరకు అతని కడుపులోకి పోయేదంతా జంక్ ఫుడ్డే.  దాంతో శరీరానికి అందాల్సిన పోషకాలు అందలేదు. ఫలితం పోషకాహారలోపం. దీనివల్ల కొన్నాళ్లకు చూపు. వినికిడి శక్తి కోల్పో యాడు. 'జరగాల్సిన నష్టం జరిగాక   ఇప్పుడేం చేయలేం. పోషకాహార లోపం తలెత్తకుండా చూసుకుంటే బాగుండేది' అన్నారు డాక్టరు. ఇదొక్కటే కాదు. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఒబెసిటీ. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ లాంటి రోగాలు రావచ్చు. జంక్ ఫుడ్ వల్ల ఎదిగే పిల్లల్లో నాడీ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ విషయాన్ని 'ఇన్స్టాల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' జర్నల్ ప్రచురించింది.

అన్నింటికీ అదే కారణం

జంక్ ఫుడ్ కల్చర్ ఈ మధ్య బాగా పెరిగింది. ముఖ్యంగా పిల్లలకు జింక్ ఫుడ్ అలవాటుచేయడం అంత మంచిది కాదు. దీని వల్ల పిల్ల ల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. మెటబాలిక్ డిజార్డర్స్ వస్తుంటాయి. ఎదిగే పిల్లలకు మైక్రో న్యూట్రియెంట్స్, మైథో మినరల్స్ ఎంతో అవసరం. అవి కేవలం కూరగాయలు. పప్పుదాన్యాలు, పండ్లలో మాత్రమే ఉంటాయి. అందుకే. ఎదిగే పిల్లల ఆహారంలో వాటిని కచ్చి తంగా  లేకపోతే స్కూటియెంట్ డెఫిషి యన్సీ వచ్చే ప్రమాదముంది. జంక్ ఫుడ్ మీద ఎక్కువగా ఆధారపడితే శరీరా నికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ అందవు. ఆ ప్రభావం వయసు పెరుగుతున్నాకొద్దీ కనిపిస్తుంది. ఎదిగే పిల్లలకు ప్రొటీన్స్ సమపాళ్లలో ఉండాలి. అప్పుడే వయసుకి తగ్గ ఎదుగుదల ఉంటుంది. జంక్ ఫుడ్ లో  ఉండే హై ఫ్యాట్ హై క్యాలరీ, హైసాల్ట్  వల్ల పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది. 

ALSO READ : Telangana Kitchen : ఆకు కూరలతో కోడిగుడ్డు కాంబినేషన్స్.. మస్త్ టేస్ట్.. మస్త్ ఆరోగ్యం

వయసు పెరిగే కొద్దీ, కంటిచూపు, హార్ట్ ప్రా మ్స్. ఐరన్ రిఫిషియెన్సీ, డిప్రెషన్, యాంగ్జెటీ లాంటి మెంటల్ డిజార్డర్స్ వస్తుంటాయి. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇమ్యూనిటీ పవర్ పెంచే ఆహారం అందించాలి. జంక్ ఫుడ్ వల్ల ఇమ్యూనిటీ పెరగకపోగా ఉన్న ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇది వయసు పెరిగేకొద్ది ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. జంక్ ఫుడ్ వల్ల పెద్దవాళ్లలో ఒబెసిటీ. కొలెస్ట్రాల్ డయాబెటిస్, హైపర్ టెన్షన్ థైరాయిడ్ సమస్య లు వస్తాయి. ఈ మధ్యకాలంలో కార్డియాక్ అరెస్టేలు కూడా ఎక్కువవుతున్నాయి. దానికి ఈ జంక్ ఫుడ్స్ కూడా కొంతవరకు కారణం జంక్ ఫుడ్, ప్యాక్ ఫుడ్, మైదాతో బేక్ చేసిన ఫుడ్స్, బయట చిరుతిండ్లు ఎంత తక్కువ తింటే అంత మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

-వెలుగు.. లైఫ్--