- జూపల్లి వర్గం కౌన్సిలర్ల ధర్నా
కొల్లపూర్(నాగర్ కర్నూల్), వెలుగు: కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ తమ వార్డుల అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం కౌన్సిలర్లు గురువారం మున్సిపల్ సాధారణ మీటింగ్ బాయ్‌కాట్ చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. పట్టణ ప్రగతిలో ఏ పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చట్టం, నిబంధనలు పట్టించుకోని చైర్ పర్సన్, కమిషనర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
చైర్ పర్సన్, కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపాలిటీలో తమ వార్డు ఉందో లేదో చెప్పాలని 6వ వార్డు కౌన్సిలర్ రమ్య ప్రశ్నించారు. మంచినీళ్లు, ఇంటర్నల్ రోడ్లు, చెత్త, కరెంట్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.