- మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలు
నాగర్ కర్నూల్, వెలుగు : అధికార పార్టీలో కొనసాగి అవమానాలపాలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, పార్టీ టికెట్ ఆశించి చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కారు దిగడం కలిసొచ్చింది. కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వీరిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆదరించి గెలిపించారు.
కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావుకు దాదాపు 28,981 వేల పైచిలుకు మెజార్టీ కట్టబెట్టారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కొడుకు డా.రాజేశ్ రెడ్డి 5,371ఓట్లు, కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి 5,410 ఓట్లతో గెలుపొందారు.