రైతులకు అండగా నిలుస్తాం : జూపల్లి కృష్ణారావు

రైతులకు అండగా నిలుస్తాం : జూపల్లి కృష్ణారావు
  • మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌‌‌ పనులను త్వరగా పూర్తి చేయాలని, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరానికి సాగు నీరు అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌‌‌‌ బాదావత్‌‌‌‌ సంతోశ్‌‌‌‌, ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి నార్లాపూర్‌‌‌‌ వద్ద పాలమూరు ప్రాజెక్టు పనులు, ఎల్లూరు పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌లో దెబ్బతిన్న మోటార్లను పరిశీలించారు. అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అనంతరం ఇంజినీరింగ్‌‌‌‌ ఆఫీసర్లతో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో.. ప్రతి రైతు పొలంలోకి సాగు నీరు పారించడం కూడా అంతే ముఖ్యమన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్ట్‌‌‌‌, కెనాల్స్‌‌‌‌ను పరిశీలించి వారం రోజుల్లో పూర్తి స్థాయి రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని, పూడిక, పిచ్చి మొక్కలు తొలగించేందుకు ఎస్టిమేట్లు రూపొందించి, పనులను ప్రారంభించాలని ఆదేశించారు.కేఎల్‌‌‌‌ఐ ప్రాజెక్ట్‌‌‌‌ కింద ఫీడర్‌‌‌‌, ఫీల్డ్‌‌‌‌ ఛానల్స్‌‌‌‌ నిర్మాణాలకు రైతులు సహకరించాలని కోరారు. ఫీడర్‌‌‌‌ ఛానల్స్‌‌‌‌ మూసేసినా, ధ్వంసం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎల్లూరు పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌పై వత్తిడి లేకుండా నార్లాపూర్‌‌‌‌ నుంచి మిషన్‌‌‌‌ భగీరథ నీటి సరఫరా పనులు, లింక్‌‌‌‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌‌‌‌ కింద భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ద్వారా మెరుగైన పునరావాసం కల్పించాలని సూచించారు. ఇరిగేషన్‌‌‌‌ సీఈ విజయభాస్కర్‌‌‌‌రెడ్డి, ఎస్‌‌‌‌ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈలు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, రవీందర్, మురళీ, శ్రీకాంత్‌‌‌‌ పాల్గొన్నారు.