మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నైతికంగా విజయం సాధించిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జూన్ 2వ తేదీ ఆదివారం సచివాలయంలో మీడియా పాయింట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఎన్నికల్లో సాంకేతికంగా 'బీఅరెస్ గెలిచింది.. నైతికంగా కాంగ్రెస్ గెలిచింది' అని అన్నారు.
గతంలో బీఆర్ఎస్ కు 920 ఓట్లు వచ్చాయని.. కాంగ్రెస్ కు350 ఓట్లు, బీజేపీకి100 ఓట్లు వచ్చయన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు 763 ఓట్లు, కాంగ్రెస్ 662 ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ సారి కాంగ్రెస్ కు300 ఓట్లు అధికంగా వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రజల దృష్టి కాంగ్రెస్ వైపే ఉందన్నారు. బీఅర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. 2018 ఎన్నికల తరువాత కేసీఆర్ ప్రతి పక్షం లేకుండా ఎమ్మెల్యే లను కొనుగోలు చేశారని.. కేసీఆర్ లాగా తాము చేయలేదన్నారు. తాము కూడా అలా చేస్తే గెలిచేవాళ్లమన్నారు.
'మేము విజయం సాధించాం' అని కేటీఆర్ అంటున్నారని.. ఇంకా 48 గంటల్లో పార్లమెంట్ ఫలితాలు వస్తాయని.. విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుస్తుందని మంత్రి అన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కుమెజారిటీ సీట్లు వస్తాయని జూపల్లి ధీమా వ్యక్తం చేశారు.