ప్రతి ఎకరాకు 10 వేల నష్టపరిహారం ఇస్తాం: జూపల్లి

ప్రతి ఎకరాకు 10 వేల నష్టపరిహారం ఇస్తాం: జూపల్లి

కామారెడ్డి: అకాల వర్షాలు, వడగళ్లతో - పంట నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం  మాసుపల్లి, జంగంపల్లి, దోమకొండా మండలం లింగుపల్లి గ్రామాల్లో  దెబ్బతిన్న పంటలను  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా  రైతులు, కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ   సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. 

 వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.  పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సర్వే పూర్తికాగానే అధికారుల నివేదిక ప్రకారం రైతులకు ఆర్థికసాయం చేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు  రైతుబంధు నగదు బదిలీ చేశామన్నారు.4,-5 ఎకరాలున్న రైతులకు వారం రోజుల్లో నగదు బదిలీ పూర్తి చేస్తామన్నారు.   బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకం ఆమలు చేయలేదని, పంట నష్టానికి కూడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. కానీప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని  పునరుద్ధరించిందని ఆయన తెలిపారు.

ALSO READ :- Ilaiyaraaja Biopic: ఇళయరాజా బ‌యోపిక్‌కి..విశ్వనటుడు కమల్ హాసన్ స్క్రీన్ ప్లే!