తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇన్నరోజులు అసెంబ్లీకి రాలేదని, అంత గర్వమా అని ప్రశ్నించారు. తనకంటే వయసులో చిన్నవాడైన సీఎం రేవంత్ రెడ్డి ముందు కూర్చోవటానికి చిన్న చూపా అని దుయ్యబట్టారు.
2023 లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చుచేసినట్టు కేసీఆర్ ప్రజలకు చూపించారని, ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం చేసినప్పుడు, అది గ్యాస్, ట్రాష్ కాదా అని ప్రాశ్నించారు.తెలంగాణ బడ్జెట్లో 25 శాతం వ్యవసాయానికి ఖర్చుపెడితే 15 శాతం గత ప్రభుత్వం అప్పులు తీర్చడంలోనే సరిపోతుందని స్పష్టం చేశారు.కేసీఆర్ అమల్లోకి తెచ్చిన రైతు బంధు ని రైతు భరోసా గా మార్చి కొనసాగించామని అన్నారు.
రైతు పండించిన ధాన్యానికి అదనంగా 500 రూపాయిలు బొనస్ ఇచ్చామని, 7 నెలలకే మేం 30వేల కోట్ల అప్పు తెచ్చామని కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు.తమ ప్రభుత్వం తెచ్చిన అప్పు బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతుందని స్పష్టం చేశారు.6 గారంటీలు కూడా ఒక్కొక్కొటిగా అమలు చేస్తున్నప్పటికీ కేసీఆర్ తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.