Astrology: వృషభ రాశిలో.. చంద్రుడు.. గురుడు కలయిక.. మూడు రాశుల వారికి గజకేసరి యోగం

Astrology: వృషభ రాశిలో.. చంద్రుడు.. గురుడు కలయిక.. మూడు రాశుల వారికి గజకేసరి యోగం

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గ్రహాల్లో చంద్రుడు తన రాశిని అత్యంత వేగంగా మార్చుకుంటాడని చెప్పబడింది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న బృహస్పతితో ( గురుడు)  చంద్రుడు కలసి సంచరిస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నాయి. . ఈ రెండింటి కలయిక శక్తివంతమైన గజకేసరి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ కారణంగా మూడు రాశుల వారికి ( వృశ్చికం.. కుంభం... మీన)  ప్రతి రంగంలోనూ ప్రయోజనాలు లభిస్తాయి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 5న ఉదయం 8:12 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దేవ గురువు బృహస్పతి ఇప్పటికే వృషభ రాశిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో చంద్రుడు, బృహస్పతి కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయిక శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది.

మేష రాశి:  ఈ రాశి వారికి గురుడు , చంద్రుడు .. వృషభరాశిలో  కలయిక వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి.  ఆదాయం  పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  కొత్తగా స్థిరాస్థిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది.  కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకున్నవి అనుకున్న విధంగా సాగిపోతాయి.,

వృషభరాశి: ఇదే రాశిలో చంద్రుడు.. గురుడు కలయిక వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  కొంత ఆందోళన ఉన్నప్పటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగిపోతుంది. సమాజంలో గౌరవం .. కీర్తి లభిస్తాయి.  ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది.  అలానే ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులు కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. 

మిథునరాశి:  వృషభరాశిలో గురుడు.. చంద్రుడు కలయిక వలన మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు..వ్యాపారస్తులకు టెన్షన్​ అధికమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.  

కర్కాటక రాశి: ఈ రాశి వారికి గురుడు.. చంద్రుడు కలయికతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు శత్రువులపై విజయం సాధించడం.. . మీ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తారు.  ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ప్రేమ.. పెళ్లి విషయాలు కలసి వస్తాయి.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది. 

సింహరాశి: వృషభ రాశిలో గురుడు.. చంద్రుడు  కలయికతో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడుతాయి.  జాయింట్​ వ్యాపారాలు కలసి వస్తాయి.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు ఏం జరుగుతుందోనని  కొంత ఆందోళన పడతారు.  కాని ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. 

కన్యారాశి:  వృషభరాశిలో చంద్రుడు.. గురుడు కలయిక  వలన విదేశీ సంబంధమైన అవకాశాలు బాగా కలసి వస్తాయి.  కెరీర్​ పరంగా మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎలాలంటి ఇబ్బంది లేకుండా .. కార్యాలయంలో మీదే పైచేయి అవుతుంది.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.  నిరుద్యోగులకు ఆశించిన మేరకు ఫలితాలు ఉంటాయి.  పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.  కాని ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

తులారాశి: ఈ రాశి వారికి వృషభ రాశిలో గురుడు.. చంద్రుడు కలిసి సంచారంతో ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి.  కాని చివరికి ఆ పని పూర్తవేతుంది.  పెండింగ్​ లో ఉన్న సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. కొన్ని అనుకోని ఖర్చులు రావడంతో ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవాలని పండితులు  సూచిస్తున్నారు.  

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  కెరీర్ పరంగా ఈ సమయం వీరికి చాలా బాగుంటుంది.  మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. వ్యాపారవేత్తలకు వ్యాపారంలో లాభం రావచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి.  ఈరాశి వారికి  రాజయోగ ప్రభావం కారణంగా వృశ్చిక రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.

ధనుస్సురాశి:  వృషభరాశిలో గురుడు.. చంద్రుడు కలయిక వలన .. ధనస్సరాశి వారికి సమాజంలోని వ్యక్తులకు కొత్త గుర్తింపు లభిస్తుంది. ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు.  అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలుంటాయి.  కాని ఆన్​లైన్​ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

మకరరాశి: గురుడు.. చంద్రుడు ..  వృషభరాశిలో సంచారం వలన   సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల చాలామంది లబ్ధి పొందుతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి. 

కుంభ రాశి: ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.  ఇది చాలా శుభప్రదం.దీనివలన  అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.  గజకేసరి రాజయోగ ప్రభావం కారణంగా కుంభ రాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. విలాసవంతమైన జీవితం ఏర్పడుతుంది. కెరీర్ పై దృష్టి పెడితే సక్సెస్ వీరి సొంతం. ఉద్యోగస్తులు ఆఫీసులో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అంతేకాదు వీరు ఆస్తి, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైనవారితో సమయం గడుపుతారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. 

మీనరాశి:  వీరికి కూడా గజకేసరి రాజయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. మీన రాశిలోని మూడవ ఇంట్లో బృహస్పతి , చంద్రుడు కలయిక జరగనుంది. అటువంటి పరిస్థితిలో గజకేసరి రాజయోగ ప్రభావం వల్ల మీన రాశి వారు గౌరవాన్ని పొందనున్నారు. కెరీర్‌లో పురోగతి ఏర్పడుతుంది. వ్యాపారంలో చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి.వ్యాపారులు మంచి పురోగతిని సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. సామాజిక సేవలో మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. మీకు అనేక రంగాల్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీరు కొన్ని శుభవార్తలు వింటారు.

ALSO READ | Women's Day Special: ‘ఈ పని చేసేటంత తెలివి నీకు లేదు’.. అనే రోజు నుంచి.. ఆమె నిలిచి గెలిచింది