వనపర్తి జిల్లాలో అస్తవ్యస్తంగా జూరాల కాల్వల నిర్వహణ

వనపర్తి జిల్లాలో అస్తవ్యస్తంగా జూరాల కాల్వల నిర్వహణ
  • కాలువలో ఏపుగా పెరిగిన చెట్లు
  • చివరాయకట్టుకు సాగునీరు అంతంతే

వనపర్తి/పెబ్బేరు, వెలుగు: జిల్లాలో జూరాల ప్రాజెక్టు కాలువల నిర్వాహణ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన ఎడమ కాలువలో చెత్తాచెదారం, లైనింగ్​ వెంబడి చెట్లు పెరిగాయి.  జిల్లాలో  యేటా ఖరీఫ్​, రబీ సీజన్లలో కాలువ నీరు ఆధారంగానే  పంటలు పండుతున్నాయి.  కానీ,  జూరాల నుంచి ప్రవహించే కాలువలో   కంప చెట్లు ఏపుగా పెరిగిపోయాయి.  దీంతో లైనిం గ్​ దెబ్బతింటోంది. ఫలితం గా కాలువ నీటి ప్రవాహానికి  ఆటంకం ఏర్పడుతోంది. 

చివరాయకట్టు ప్రాంతాలకు సాగునీరు అంతంతే

ఇలా ప్రధాన కాలువలో చెట్లు పెరిగి, చెత్తాచెదారం చేరి లైనింగ్​లు దెబ్బతింటున్నాయి. ఫలితం గా చివరి ఆయకట్టు ప్రాంతాలున్న వీపనగండ్ల, చిన్నంబావి, కొల్లాపూరు నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలాల  రైతులు సాగునీటి కోసం ప్రతి సంవత్సరం  ఇబ్బందులు పడుతున్నారు. రబీ సీజనులో వరితో పాటు పలు రకాల పంటలు వేసుకున్న రైతులు కోత సమయానికి సాగునీరందించాలని కోరుతున్నారు. వర్షాకాలంలో కర్ణాటకలోని నారాయణపూర్​ ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తడంతో  వరద నీరు   జూరాల కు చేరుతుంది. ఈ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడంతో  ఈ  వరదతో  స్థానిక రైతులు నష్టపోతున్నారు.  యాసంగిలో అయినా  జూరాల నీరంది పంటలు పండుతాయనుకుంటే కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయి,  నిర్వహన సరిగా లేక నీరు అందడం లేదు.  

కూలనున్న బ్రిడ్జి...

  గ్రామాలను కలిపే జూరాల ప్రధాన ఎడమ కాలువ పై పెబ్బేరు శివారులో ఒక బ్రిడ్జి నిర్మించారు. పాత బడిన బ్రిడ్జికి ఒక వైపు  రెయిలింగ్​ గోడ కూలిపోవడంతో ప్రమాదకరంగా మారింది. రోజూ రైతులు ఆ బ్రిడ్జి మీదుగా పోతున్నారు.  ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు ఈ బ్రిడ్జి మీదుగానే పోతున్నాయి.  బ్రిడ్జి రెయిలింగ్​ గోడను నిర్మించి ప్రమాదాన్ని నివారించమని రైతులు అధికారులను కోరినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు.   చిరవకు రెయిలింగ్​ గోడ పడిపోయిన ప్రాంతంలో ఒక ప్లాస్టిక్​ తాడు కట్టి వదిలేశారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగినా రైతులు, పశువులు, వాహనాలు జూరాల కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది.  మళ్లీ వర్షాకాలం నాటికి బ్రిడ్జి రెయిలింగ్​ గోడను నిర్మించాలని, అదేవిధంగా కాలువలో పేరుకుపోయిన చెట్లను తొలగించి లైనింగ్​ను దృఢపరచాలని రైతులు 
కోరుతున్నారు. 

ALSO READ : స్క్రాప్ నుంచి కరెంట్​ ఉత్పత్తి .. హుజూరాబాద్ మూడో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
 

ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం

జూరాల ప్రధాన కాలువ వెంబడి పెరిగిన చెట్లూ చేమలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. సిబ్బంది సరిగ్గా పనిచేస్తున్నారా? లేనిది స్వయంగా పరిశీలిస్తున్నాం. కొన్ని చోట్ల చెట్లు కొట్టేయడానికి వీలుపడని ప్రాంతాల్లో నిపుణులైన వారితో కొట్టిస్తాం. ఫిషరీస్​ కాలేజీ వద్ద గల బ్రిడ్జి పై రెయిలిం గ్​ గోడ నిర్మాణానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. రాగానే నిర్మిస్తాం.
- భావన, డీఈఈ ఇరిగేషన్​శాఖ, పెబ్బేరు