![డైనోసర్స్ మళ్లీ వస్తున్నాయ్.. ట్రైలర్ చూశారా..?](https://static.v6velugu.com/uploads/2025/02/jurassic-world-rebirth-trailer-scarlett-johansson-and-jonathan-bailey-fight-dinosaurs_zFyfSWQYd6.jpg)
డైనోసర్స్ నేపథ్యంలో సాగే జురాసిక్ వరల్డ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్.. 1993లో పరిచయం చేసిన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే ఆరు సినిమాలు వచ్చి మెప్పించాయి. ఇప్పుడు ఏడో సినిమాగా ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఓ పరిశోధన కోసం జురాసిక్ పార్క్ ఉన్న ఐలాండ్‌కు వెళ్లిన రీసెర్చ్ టీమ్.. అక్కడ డైనోసార్స్‌కు సంబంధించిన డీఎన్‌ఐ సేకరించాల్సి ఉంటుంది. కానీ వాళ్లు ఊహించని విధంగా అక్కడ ప్రమాదకరమైన డైనోసర్స్ ఉంటాయి. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్ర కథ. స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్‌లో నటించింది. తొలి రెండు చిత్రాలకు కథను అందించిన డేవిడ్ కోప్ దీనికి కథను అందించగా, ‘స్టార్ వార్స్’ లాంటి చిత్రాలకు విజువల్స్ ఇచ్చిన గరేత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేశాడు. జులై 4న తెలుగుతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.