Health tips: రోజూ 30 నిమిషాల వాకింగ్తో ఎంతో ఆరోగ్యం..ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే 6మార్గాలు

Health tips: రోజూ 30 నిమిషాల వాకింగ్తో ఎంతో ఆరోగ్యం..ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే 6మార్గాలు

రోజూ వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు, హెల్త్ నిపుణులు చెబుతుంటారు. ప్రతి రోజు పొద్దున లేవగానే లేదా సాయంత్రం వేళల్లో నడిస్తే శారీరకంగా, మానసిక ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. రోజూ నడక.. మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు.వాకింగ్  ఎలా చేయాలి.. ఎంత సమయం చేయాలి.. ఏ పద్దతిలో చేయాలి అనే అంశాలపై  ఆరోగ్యనిపుణులు కొన్ని మార్గాలు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. 

ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ వాకింగ్ చేస్తారు. కానీ ఓ క్రమపద్దతిలో కాకుండా వారికి ఇష్టం వచ్చిన విధంగా చేస్తుంటారు.. అయితే నిర్దిష్ట సమయం, క్రమపద్దతిలో వాకింగ్ కొంతకాలంగా చేస్తే  ఎక్కువ ప్రయోజనాలుంటాయట. రోజు కేవలం 30 నిమిషాలు వేగంగా, ఎక్కవు దూరం నడిస్తే( వాకింగ్)  మంచి ఫలితాలుంటాయట. రోజూ ఇలా చేస్తే గుండెకు సంబంధించిన ఫిట్ నెస్, ఎముకలకు బలం, శరీరంలోని కొవ్వును కరిగించడంలో మెరుగైన ఫలిలాలను పొందవచ్చు.కండరాల శక్తిని మెరుగుపరుస్తుంది. మీలో ఓపిక , సహనం పెంపొందిస్తుందంటున్నారు డాక్టర్లు. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెట్స్, ఓస్టోపోరిసిస్, కొన్ని రకాల ప్రాణాంత వ్యాధులకు చెక్ పెట్టొచ్చంటున్నారు. 

ALSO READ | వంట నూనెల్లో ఇన్ని రకాలా.. ఆరోగ్యానికి ఏ నూనె మంచిది?

రోజు బ్రిస్క్ వాకింగ్ చేస్తే శరీరంలోని కొవ్వును తగ్గించడమే కాకుండా, ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయొచ్చు. 

గుండెను బలోపేతం చేయొచ్చు..

రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు. స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. వాకింగ్ తో బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.క్యాన్సర్, టైప్ 2 డయాబెట్స్ వచ్చే అవకాశాలను తక్కువ అంటున్నారు. 

ఎముకలు బలంగా.. 

ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఎముకల శక్తి మెరుగు పడుతుంది. అంతేకాదు కండరాలు బలంగా తయారవుతాయి. కండరాల ఎండ్యూరెన్స్ కు సాయపడుతుంది. 

ఉత్తేజం.. 

వాకింగ్ శరీరంలో శక్తిస్థాయిలను మెరుగుపరుస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో మంచి మానసిక స్థితిని అందిస్తుంది. మంచి నిద్ర పడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. కండరాల సమన్వయం చేస్తుంది. 

వాకింగ్ ఎలా చేయాలి.. 

మీరు వేగంగా ఎక్కువ దూరం తరచుగా నడిచినప్పుడు ప్రయోజనాలు పెరుగుతాయి. కొంచెం వేగంగా, కొంచెం రిలాక్స్ వాకింగ్ లను మార్చుకుంటూ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అలా వాకింగ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ పెరుగుతుంది.ఎక్కువ కేలరీలు బర్న్ చేయబడతాయి. ఈ వాకింగ్ సాధారణ వాకింగ్ కంటే తక్కువ సమయంలో పూర్వవుతుంది. అని సీనియర్ కన్సల్టెంట్ , కార్డియాలజీ, PSRI హాస్పిటల్ డాక్టర్ రవి ప్రకాష్ తెలిపారు.