
ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర యూఎస్ పర్యటనలో ట్రంప్ తో భేటీ అయిన కొన్నాళ్లకే అదానీపై విచారణ అంశాన్ని యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (SEC) తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. గౌతమ్ అదానీ, అతని అల్లుడు సాగర్ అదానీలపై 265 మిలియన్ డాలర్ల (రూ.2,200 కోట్లు) లంచం ఆరోపణలపై విచారణకు సహకరించాల్సిందిగా భారత న్యాయశాఖను కోరినట్లు స్థానిక న్యూయార్క్ కోర్టుకు తెలిపింది.
అయితే భారత న్యాయశాఖ గానీ, అదానీ గ్రూప్ గానీ ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదు.
గత ఏడాది (2024) అదానీ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కరెంటును కొనేలా ఒప్పించాలని అదానీ కంపెనీ అధికారులకు లంచం ఇచ్చినట్లు బ్రూక్ లైన్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో యూఎస్ ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. అయితే ఇవి నిరాధారమైన ఆరోపణలని అప్పట్లో అదానీ గ్రూప్ కొట్టివేసింది.
Also Read :- భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్
ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్ర తీవ్రంగా స్పందించారు. యూఎస్ ఎస్ఈసీ అదానీని విచారించాలని అనుకుంటుందని, మరి మోదీ తన ప్రాణ స్నేహితుడిని విచారణకు ఆదేశిస్తారా లేదా కాపాడతారా.. అంటూ సెటైర్లు వేశారు.