పెళ్లైన మూడు రోజులకే.. ఫలక్‌నుమా రౌడీ షీటర్ దారుణ హత్య

పెళ్లైన మూడు రోజులకే.. ఫలక్‌నుమా రౌడీ షీటర్ దారుణ హత్య

కత్తి పట్టిన వాడు కత్తి పోటుకే బలైపోతాడు.. అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. అదే మాదిరిగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ రౌడీషీటర్ జీవితం ముగిసింది. విచారకరమైన విషయం ఏమిటంటే.. రౌడీషీటర్ కు మూడు రోజుల క్రితమే పెళ్లైంది. వివాహ జీవితంలో ఆనందంగా ఉండాల్సిన సమయంలో అనంత లోకాలకు చేరడంతో అతని అనుచరులు విషాదంలో మునిగిపోయారు. 

వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్ సిటీ ఫలక్ నుమాకు చెందిన రౌడీ షీటర్ మాస్ యుద్ధీన్ ఆదివారం (ఏప్రిల్ 13) రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే డీలక్స్ మెడికల్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రెయిన్బజార్లోని డబీర్ పూర ఫ్లై ఓవర్ వద్ద కత్తితో తీవ్రంగా దాడి చేసి హత్య చంపేశారు.

స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి చేరుకున్న  రెయిన్ బజార్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాస్ యుద్ధీన్ ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.