వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ కు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ లో కోహ్లీ, రోహిత్ తో సహా పలువురు సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత కుర్రాళ్లను కంగారూల మీదకు పంపుతుంది. టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ భారత జట్టుకు తొలి సారి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ముంబై ఆటగాడికి మ్యాచ్ కు ముందే చేదు అనుభవం ఎదురైంది.
వైజాగ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు(నవంబర్ 23) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు నిన్న (నవంబర్ 22) ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కెప్టెన్ సూర్యను ఇద్దరు జర్నలిస్టులు మాత్రమే రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇండియాలో క్రికెట్ ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోని దగ్గర నుంచి రోహిత్ శర్మ వరకు విలేఖరులు ప్రశ్నలతో వేధిస్తూ మన కెప్టెన్ల సహనాన్ని పరీక్షిస్తారు. కానీ కెప్టెన్ గా సూర్యకు మాత్రం వైజాగ్ లో ఊహించని షాక్ తగిలింది.
ఇటీవలే ముగిసిన ఐసీసీ 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో కెప్టెన్ రోహిత్ ను ఇంటర్వ్యూ చేయడానికి భారీ సంఖ్యలో జర్నలిస్టులు వచ్చారు. ద్వైపాక్షిక సిరీస్ లు అయినా ఒక ఇండియన్ కెప్టెన్ ను కేవలం ఇద్దరు జర్నలిస్టులు మాత్రమే ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి. దీంతో సూర్య కుమార్ యాదవ్ పై కావాలనే మీడియా వివక్ష చూపుతుందని నెటిజన్స్ భావిస్తున్నారు. వేరే ప్లేయర్లకు లేని వివక్ష సూర్య పైనే ఎందుకు అని కొంతమంది ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇక ఈ మ్యాచ్ విషయాన్ని వస్తే సూర్య సారధ్యంలో భారత యువ జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాతో పోటీ పడేందుకు సిద్ధమవుతుంది. భారత జట్టు యంగ్ ప్లేయర్స్ తో నిండిపోతే.. ఆసీస్ స్మిత్, మ్యాక్స్ వెల్, హెడ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్లతో బలంగా కనిపిస్తుంది. సొంత గడ్డపై ఆడటం భారత్ కు అనుకూలంగా ఉన్నా.. టీ 20 మ్యాచ్ లంటే ఏదైనా జరగొచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
ప్రస్తుతం సూర్య టీ20 ల్లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. 50 టీ20 ఇన్నింగ్స్‌లలో 1841 పరుగులు చేసాడు. మరో 159 పరుగులు చేస్తే 2000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతర్జాతీయ టీ 20ల్లో వేగంగా 2000 పరుగులు చేసిన రికార్డ్ పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌ల పేరిట ఉంది. వీరిద్దరూ 52 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించారు. సూర్య మరో రెండు ఇన్నింగ్స్ ల్లో 159 పరుగులు చేస్తే వీరిద్దరి రికార్డ్ సమం చేస్తాడు.
Press Confrence #INDvsAUS #SuryaKumarYadav pic.twitter.com/1juF6KIhDf
— Surya Kumar Yadav (@Beuniqueboi) November 23, 2023
Also Read :- మొదటి టీ20కు భారీ వర్ష సూచన.. మ్యాచ్ జరుగుతుందా..?