Supreme Court:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్

Supreme Court:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ని నియమించాలని  కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సీజీఐ సంజీవ్ ఖన్నా బుధవారం(ఏప్రిల్16) సిఫార్సు చేశారు.మే 13న సిట్టింగ్ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా  పదవీవిరమణ చేస్తుండటంతో ఆయన వారసుడిగా జస్టిస్ గవాయ్  52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించనున్నారు.జస్టిస్ గవాయ్ ప్రస్తుతం CJI ఖన్నా తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి. జస్టిస్ గవాయ్ మే 14న CJI గా బాధ్యతలు స్వీకరిస్తారు. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన నవంబర్ 23, 2025న పదవీ విరమణ చేసే వరకు పదవిలో కొనసాగనున్నారు.

గవాయ్ నవంబర్ 24, 1960న అమరావతిలో జన్మించారు. మార్చి 16, 1985న న్యాయవాదిగా చేరారు. 1987 నుంచి 1990 వరకు బాంబే హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేశారు. 1990 తర్వాత బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో రాజ్యాంగ,పరిపాలనా చట్టంపై దృష్టి సారించి ప్రాక్టీస్ చేశారు. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ,అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు.నవంబర్ 14, 2003న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.నవంబర్ 12, 2005న బొంబాయి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 

►ALSO READ | ట్రంప్ తరిమేస్తుంటే.. చైనా రమ్మంటోంది.. ఇండియన్స్కు 85 వేల వీసాలు జారీ చేసి రికార్డ్

ఈ పదవీకాలంలో ముంబైలోని ప్రిన్సిపల్ సీటులో,నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీలోని బెంచ్‌లలో పనిచేశారు. తరువాత మే 24, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా,నాగ్‌పూర్, ఔరంగాబాద్ ,పనాజీలలో బెంచ్‌లలో పనిచేశారు. మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.