బీజేపీ, బీఆర్​ఎస్​ రెండూ ఒక్కటే : చంద్ర కుమార్, మురళి

జగిత్యాల టౌన్,వెలుగు : బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని, వాటిని ఓడగొడితేనే బతుకులు బాగుపడతాయని జస్టిస్ చంద్ర కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక అధ్వర్యంలో జగిత్యాలలో  జాగో తెలంగాణ ‘బస్ యాత్ర’ నిర్వహించారు.

రాష్ట్రంలో అవినీతి, ఆర్థిక దోపిడీ రాజకీయాలను ఓడించాలన్నారు. ఓటు  ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్ పద్మజ,  న్యాయవాది  గోవర్ధన్, సుదర్శన్, పాల్గొన్నారు.

ALSO READ : నవంబర్ 3 నుంచి నామినేషన్ల పర్వం : కలెక్టర్​ ఆర్​వీ.కర్ణ