రైతులకు మద్దతు ధర కల్పించాలి : చంద్ర కుమార్

కాశీబుగ్గ, వెలుగు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం సిటీలోని తెలంగాణ రైతు భవన్​లో రౌండ్​ టేబుట్​ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన జస్టిస్​ చంద్రకుమార్​ మాట్లాడుతూ స్వామినాథన్​ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని, పంటల భీమా పథకం వచ్చే వానాకాలంలో అమలులోకి తేవాలని, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, మార్కెట్లో ధరలు పడిపోతున్నప్పుడు ఆ మేరకు బోనస్​ రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయాలన్నారు. 

2022లో సమ్మె చేసిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన  హామీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రొఫెసర్​వెంకటనారాయణ, రాజయ్య, శ్రీనివాస్​, గోవర్ధన్​, రవీందర్​, బుచ్చిరెడ్డి, రాజేందర్​, భాస్కర్​, కిషన్​, ప్రసాద్ ఉన్నారు.