కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారులతో జ్యూడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ సమావేశం ముగిసింది.కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత, పిల్లర్ల కుంగుబాటుపై జసిస్ట్ చంద్రఘోష్, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను పిలిచి మాకు కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటా మన్నారు. రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ప్రజల అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకొని విచారణ మొదలు పెడతామన్నారు జస్టిస్ చంద్రఘోష్.
విచారణలో ఎన్ డీ ఎస్ ఏ, విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపొర్టును పరిగణనలోకి తీసుకుంటామన్నారు జస్టిస్ చంద్రఘోష్. ఇంజనీర్లు, ఎన్ డీఎస్ ఏ అథారిటీతో కూడా సమావేశం అవుతామన్నారు. వీరిచ్చే టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తామన్నారు. కాళేశ్వరం బ్యారేజీతో సంబంధమున్న ప్రతి ఒక్కరిని కలిసి సమాచారం సేకరిస్తామన్నారు. లీగల్ సమస్యలు తలెత్తకుండా విచారణ కొనసాగిస్తామన్నారు.
Also Read:రైతుల ద్రోహి కేసీఆర్
రెండోసారి మేడిగడ్డ గ్రౌండ్ కు వెళ్లి బ్యారేజీలను పరిశీలిస్తమన్నారు జస్టిస్ చంద్రఘోష్. నిర్మాణ సంస్థలతోపాటు అవసరమైతే రాజకీయ నాయకులకు సైతం నోటీసులు ఇస్తామన్నారు.
సెకండ్ విజిట్లో మేడిగడ్డ గ్రౌండ్ కు వెళ్లి బ్యారేజీలను పరిశీలన చేస్తాం. ఇప్పటివరకు పవర్ పాయింగ్ ప్రజెంటేషన్ల ద్వారా విషయాలను తెలుసుకున్నాను. నివేదిక ల ఆధారంగానే విచారణ కొనసాగుతుందన్నారు జస్టస్ చంద్రఘోష్. దానితోపాటు ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోనికి తీసుకుంటామన్నారు జస్టిస్ చంద్రఘోష్.