
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు జస్టిస్ ఈశ్వరయ్య. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన..బీజేపీ,బీఆర్ఎస్ కు కులగణన పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కేసీఆర్, హరీశ్ ,కేటీఆర్, కవితలకు లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయం చేయొద్దని సూచించారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి సూచనలు చేశానన్నారు జస్టిస్ ఈశ్వరయ్య . మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఈశ్వరయ్య. మెడికల్ సీట్ల విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు.
Also Read :- కేసీఆర్ 4 కోట్ల ప్రజల హీరో అయితే.. మరి ఓట్లు ఎందుకు వేయలేదు
తెలంగాణలో కులగణన తప్పల తడక అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే సర్వేలో వివరాలివ్వని కేసీఆర్,హరీశ్,కేటీఆర్ లకు ప్రశ్నించే అర్హత లేదని కౌంటర్ ఇచ్చింది. ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు కులగణన సర్వే జరుగుతోంది. గత కులగణన సర్వేలో వివరాలివ్వని వాళ్లు వివరాలిచ్చేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.