బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమే:జస్టిస్ ఈశ్వరయ్య

బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమే:జస్టిస్ ఈశ్వరయ్య
  • బీసీ కమిషన్​ మాజీ చైర్మన్​  జస్టిస్ ఈశ్వరయ్య

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం సాధ్యమేనని బీసీ కమిషన్​ మాజీ చైర్మన్​జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. సోమవారం ఆయనతో బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్​లో ఇచ్చిన హామీ మేరకు.. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణన, న్యాయపరమైన సాధ్యాసాధ్యాలపై చర్చించారు.  

ఈ సందర్భంగా బీఆర్ఎస్​ నేతలు మాట్లాడుతూ..కాంగ్రెస్ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేసి, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అప్పటిదాకా బీఆర్ఎస్ రాజీ లేకుండా పోరాడుతుందన్నారు. 

కార్యక్రమంలో శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంబీర్పూర్ రాజు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, వి గంగాధర్ గౌడ్, సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్, మాజీ చైర్మన్లు పల్లె రవి కుమార్ గౌడ్, ఆంజనేయ గౌడ్, చిరుమల్ల రాకేశ్, నాగేందర్ గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, నోముల భగత్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్ర చారి, శుభప్రద్ పటేల్, ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్, కార్యదర్శి మన్నె రాజు ముదిరాజ్ పాల్గొన్నారు.