కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల: కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రతి ఐదు, పదేండ్లకోసారి జనాభా, కుల గణన చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ప్రభుత్వ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై వివిధ కుల సంఘాల నాయకులతో మీటింగ్ నిర్వహించారు. 

ఎంపీ గడ్డం వంశీకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరైన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టడం సంతోషకరం. ఆయా సామాజిక వర్గాల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బడుగు, బలహీన వర్గాలకు సమాన న్యాయం చేకూరుతుంది.  రాష్ట్రంలో గత పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. కులగణన కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా మారుతుంది’ అని తెలిపారు.

ప్రతిష్టాత్మకంగా కులగణన (బాక్స్)

కులగణన అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల వెళ్తున్న ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్​బీ గెస్ట్ హౌజ్ లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్​తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు ఎంపీని శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎంపీ కులగణనపై మీడియాతో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కులగణన   చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే  కుల గణన చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించనుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మక్కా న్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల వారు  అత్యున్నత స్థాయికి వెళ్లడానికి కుల గణన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.