బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం: ఎంపీ పురందరేశ్వరి

బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం: ఎంపీ పురందరేశ్వరి

కరీంనగర్, వెలుగు : వికసిత్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందరేశ్వరి అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని చెప్పారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యమని చెప్పారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌పై కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని వైశ్య భవన్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన సదస్సుకు ఆమె చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరయ్యారు. అంతకుముందు శ్వేత హోటల్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ‘బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో డిఫెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రూ.12 లక్షల వరకు ఇన్‌‌‌‌‌‌‌‌కం టాక్స్‌‌‌‌‌‌‌‌ లేదన్న ప్రకటన.. కోట్లాది మందికి సంతోషాన్ని ఇచ్చింది’ అని పురందరేశ్వరి అన్నారు.

కుల గ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ సందర్బంగా ముస్లింల‌‌‌‌‌‌‌‌ను బీసీల్లో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అనడం బీసీలను అవమానించడమేనని, అసలు ఆ పదానికి అర్థం ఏంటో ఆయనే చెప్పాలన్నారు. సమావేశంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు, వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్ ప్రోగ్రాం స్టేట్ కో ఆర్డినేటర్ గంగిడి మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీమేయర్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌రావు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.