హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం జ్యుడీషియల్‌కమిషన్ తదుపరి ఓపెన్కోర్టు విచారణను మరో వారం రోజుల్లో మొదలు పెట్టనుంది. ఈ నెల 17న కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్రానికి రానున్నారు. వచ్చిన మర్నాడు నుంచి ఓపెన్ కోర్టు విచారణను ఆయన మొదలుపెట్టనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ దఫా 24 వరకు ఇక్కడే ఉండి వారం పాటు ఓపెన్ కోర్టును ఆయన నిర్వహించనున్నారు.
ఇద్దరు రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్ రావు, నల్లా వెంకటేశ్వర్లుతోపాటు మరో ఈఎన్సీ హరిరామ్‌ను ఓపెన్‌కోర్టుకు పిలవనున్నట్టు తెలిసింది. పోయినసారే వారిని విచారించాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో అది సాధ్యపడలేదు. తాజాగా వారిని ఓపెన్‌కోర్టుకు పిలిచే అవకాశం ఉందని తెలిసింది.