ఆర్మూర్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్ట దత్తాద్రి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ.. టీచర్ల నెత్తిన 317 జీఓను రుద్దిందని వాపోయారు.
సొంత జిల్లాకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఆర్మూర్అంబేద్కర్చౌరస్తాలో 317 జీఓ కారణంగా సూసైడ్ చేసుకున్న బేతాళ సరస్వతి ఫొటోకు సంఘం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 30 మంది టీచర్లు, ఉద్యోగులు చనిపోయారని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. 317జీఓతో టీచర్లు కుటుంబాలకు దూరమయ్యారని, కాంగ్రెస్ప్రభుత్వం స్పందించి సొంత జిల్లాలకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో 317 జీఓ బాధిత టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు