తెలంగాణ హైకోర్టు ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. MS రామచంద్రరావు అనే సీనియర్ న్యాయవాదిని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక CJ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. రాజ్యాంగం రూపొందించిన ఆర్టికల్ 223 ప్రకారం MS రామచంద్రరావు ను తాత్కాలిక జడ్జిగా నియమిస్తున్నట్లు తెలిపింది.
జస్టిస్ MS రామచంద్రరావు 1966లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఇండియన్ లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు. ఉస్మానియా యూనివర్సిటీలో LLB అభ్యసించిన జస్టిస్ రామచంద్రరావు.. 1991లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో LLM పూర్తి చేశారు.
1989లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలు అందించారు. ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012లో నియమితులైన జస్టిస్ రామచంద్రరావు 2013 డిసెంబరు 4 నుంచి జడ్జిగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం ఉన్న జడ్జి హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.