ఇంజనీర్లపై జస్టిస్ పీసీ చంద్ర ఘోష్ కమిషన్ సీరియస్ అయ్యింది. పొంతనలేని సమాధానాలు చెప్పడంపై ఇంజనీర్ల తీరును తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టులో భాగంగా ఆగస్టు 27న విచారణకు హాజరయ్యారు ఐదుగురు తాజా, మాజీ CDO ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు.
విచారణలో భాగంగా అప్రూవల్ పొందిన తర్వాత బ్యారేజీల డిజైన్లలో మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా అని కమిషన్ ప్రశ్నించింది. డిజైన్లు అప్రూవల్ చేసే ముందు ఆ తర్వాత అన్ని నిబంధనలు పాటించారా అని ప్రశ్నించారు పీసీ ఘోష్. హై పవర్ కమిటీ నిబంధనలు క్రైటీరియా ఫాలో అయ్యారా లేదా అని ఇంజనీర్లను ప్రశ్నించారు. డిజైన్స్ అప్రూవల్ అయిన తర్వాత లొకేషన్ లలో ఏమైనా మార్పులు చేర్పులు చేశారని ప్రశ్నించారు.
Also Read :- మేయర్ ఇంట్లో చెత్త వేసి జనం
అన్నారం సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ మారినట్లు కమిషన్ కు చెప్పారు అధికారులు. మేడిగడ్డ లోకేషన్ మారలేదని కమిషన్ ముందు స్పష్టం చేశారు తాజా మాజీ ఇంజనీర్లు. సిడిఓ - ఎల్ అండ్ టి వేరువేరుగా డిజైన్లు తయారుచేసి ఫైనల్ అప్రూవల్ కు అన్ని ఒకే దగ్గర చేసినట్లు తెలిపారు. మూడు బ్యారేజీలకు సంబంధించి డిజైన్లలో ఎలాంటి సమస్య లేదని నిబంధనల ప్రకారమే డిజైన్లు ఉన్నాయని తెలిపారు ఇంజనీర్లు.
అయితే కమిషన్ అడిగే ప్రశ్నలకే ఎదురు ప్రశ్నలు వేయడంతో పాటు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు CDO మాజీ ఇంజనీర్లు. దీంతో కమిషన్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 27 మధ్యాహ్నం వరకు ఇద్దరి ఇంజనీర్ల విచారణ ముగిసింది. కాసేపట్లో మరో ముగ్గురు ఇంజనీర్లను కమిషన్ విచారించనుంది.