కాళేశ్వరంపై 3వ రోజు కమిషన్ విచారణ.. కీలక అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఆగస్ట్ 23 (శుక్రవారం) మూడవ రోజు విచారణకు సీడీఓ ఎస్ఈ ఫజల్ అటెండ్ అయ్యారు. జస్టిస్ ఘోష్ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సీకెంట్ ఫైల్స్ తో పాటు , సుందిళ్ల బ్యారేజి రెండో బ్లాక్ ఏ లో అదనపు ఆరు వెంట్లు డిజైన్స్ ల అంశాలపై పలు పశ్నలు అడిగారు. 

కాళేశ్వరం సీఈ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్ సెక్షన్స్ ఆమోదించామన్నారు సీడీఓ ఎస్ఈ ఫజల్. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన సీడీఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి పలు కీలక అంశాలను వివరించారు. 

ALSO READ | పరిశ్రమలకు సహకారం అందిస్తాం