ఇయ్యాల తెలంగాణకి జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్

ఇయ్యాల  తెలంగాణకి జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్
  • 11 రోజులు కొనసాగనున్న ఎంక్వైరీ 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​ శుక్రవారం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరిపిన జస్టిస్ ​ఘోష్​.. ఈసారి విచారణలో భాగంగా ఆయన 11 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ దఫా అఫిడవిట్లు సమర్పించిన వారిని బహిరంగంగా ఎంక్వైరీ చేయనున్నారు.

ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లోని అన్ని విభాగాల నుంచి అఫిడవిట్లను కమిషన్​కు ఇప్పటికే సమర్పించారు. కానీ, ఈ నెల 7 నాటికి ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ను అందించాలని కోరినా.. ఆ నివేదిక తయారీకి టైం పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. జియో టెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ చేస్తున్న సమయంలో ఇబ్బందులు వస్తుండడంతో అక్కడ ఆ టెస్టులను అధికారులు ఆపేశారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయాలను సూచించాలని ఇరిగేషన్​ అధికారులు ఎన్​డీఎస్​ఏకి లేఖ రాశారు. దానికి అనుగుణంగా ఎన్​డీఎస్​ఏ చేసే సిఫార్సులకు అనుగుణంగా అక్కడ టెస్టులు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీంతో కమిషన్​ గడువును పొడిగించే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.