లోకాయుక్తగా జస్టిస్​ రాజశేఖర్​రెడ్డి నియామకం..ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

లోకాయుక్తగా జస్టిస్​ రాజశేఖర్​రెడ్డి నియామకం..ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

హైదరాబాద్, వెలుగు: లోకాయుక్తగా జస్టిస్ బి.రాజశేఖర్​ రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్టిస్‌‌‌‌ జగ్జీవన్‌‌‌‌ కుమార్‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఐదేండ్ల పాటు లోకాయుక్త, ఉపలోకాయుక్త కొనసాగనున్నారు. అవినీతి, అక్రమాలపై ప్రజల ఫిర్యాదులను విచారించి, న్యాయం చేసే బాధ్యత ఈ సంస్థకు ఉంటుంది.  

దీంతో పాటు.. హెచ్​ఆర్​సీ చైర్మన్, సభ్యులను కూడా నియమిస్తూ ప్రభుత్వం మరొక జీవోను కూడా రిలీజ్​ చేసింది. మానవ హక్కుల కమిషన్​చైర్​పర్సన్​గా జస్టిస్​షమీమ్​అక్తర్​ను నియమించింది. హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ జ్యుడిషియల్ సభ్యులుగా ​శివాడి ప్రవీణ్‌‌‌‌,  నాన్​ జ్యూడిషియల్​రిటైర్డ్​ఐఏఎస్​ బి. కిషోర్‌‌‌‌లను ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మూడేండ్ల పాటు వీరు కొనసాగుతారు.  చైర్మన్‌‌‌‌, సభ్యులు కలిసి మానవ హక్కుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తారు. జైళ్లలో ఖైదీల పరిస్థితులను సమీక్షించడం, హక్కుల ఉల్లంఘనలపై సిఫార్సులు చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు.