జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి : విద్యాశాఖ సెక్రటరీకి తపస్ వినతి 

జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి : విద్యాశాఖ సెక్రటరీకి తపస్ వినతి 
  •  విద్యాశాఖ సెక్రటరీకి తపస్ వినతి 

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ రిక్రూట్ మెంట్ కంటే ముందే జీవో 317 బాధితులకు న్యాయం చేసి, వారికి బదిలీలు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి వారు వినతిపత్రం అందించారు.

రాష్ట్రంలోని హెడ్మాస్టర్ల పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. నూతన విద్యావిధానం ప్రకారం ఎన్​సీఈఆర్టీ సిలబస్ నే పుస్తకాల్లో చేర్చాలని, తద్వారా జేఈఈ, నీట్ అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. బదిలీ అయినా రిలీవ్ కాని టీచర్ల వర్క్ అడ్జెస్ మెంట్ కంటే ముందే రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై బుర్రా వెంకటేశం మాట్లాడుతూ... హెచ్ఎం ప్రమోషన్లకు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్యానల్ ఇయర్ గా ప్రకటించి ప్రమోషన్లు ఇస్తామని వెల్లడించారు. జీవో 317 బాధితుల సమస్యకు ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపనున్నదని చెప్పారు.