తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజన్ పాల్ నియమితులయ్యారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే బాంబై హైకోర్టు సీజేగా ట్రాన్స్‎ఫర్ అయ్యారు. ఈ మేరకు 2025, జనవరి 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సుజన్ పాల్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 

ALSO READ | పసుపు రైతులకు గుడ్ న్యూస్: నిజామాబాద్‎లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

సీజే ఆలోక్ అరాధే బదిలీ కావడంతో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న సుజన్ పాల్‎ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టు సీజేగా అపాయింట్ చేసింది. కాగా, జస్టిస్ ఆలోక్ అరాధేను బాంబై హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలిజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కొలిజియం సిఫారసుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. ఆయనను బాంబై హైకోర్టుకు ట్రాన్స్‎ఫర్ చేసింది.