తెలంగాణ హైకోర్టు సీజేగా సుజయ్​ పాల్​

  • అలోక్ అరాధేకు బాంబే హైకోర్టు సీజేగా బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టు సీజే అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరాధేను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన న్యాయమూర్తి బదిలీ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సీజే  బాధ్యతలను జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. 

జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1964 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న జన్మించారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రాణిదుర్గావతి యూనివర్సిటీలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, పీజీ పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక వివాదాలు, సర్వీసు కేసుల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. 2011లో మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నిరుడు మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి.