హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) తండ్రయ్యాడు. జస్టిన్ బీబర్, భార్య హేలీ (Hailey) శనివారం (ఆగస్ట్ 24న) ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు జాక్ బ్లూస్ బీబర్(Jack Blues Bieber) అని నామకరణం చేసినట్లు తెలిపారు.
''వెల్కమ్ హోమ్ జాక్ బ్లూస్ బీబర్'' అని జస్టిన్ బీబర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్‌లో ఫోటో షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలోనే జస్టిన్ బీబర్ దంపతులు తల్లి తండ్రులం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
నిశ్చితార్థం జరిగిన రెండు నెలల తర్వాత ఈ జంట సెప్టెంబర్ 2018లో న్యూయార్క్ నగరంలోని న్యాయస్థానంలో వివాహం చేసుకున్నారు. సౌత్ కరోలినాలోని బ్లఫ్‌టన్‌లో టిఫనీ వెడ్డింగ్ బ్యాండ్‌లను మార్చుకుని, కుటుంబం మరియు స్నేహితుల ముందు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇటీవల అంబానీ పెళ్ళిలో జస్టిన్ తన పాటలతో ఆహుతులను ఆకట్టుకోనున్నాడు. ఇక ఈ ఈవెంట్ కోసం జస్టిన్ బీబర్ కి దాదాపు రూ.100 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఒక సింగర్ కోసం రూ.100 కోట్లు ఆఫర్ చేశారంటే మాములు విషయం కాదు.