Jasprit Bumrah: బుమ్రా పాకిస్థాన్ దిగ్గజ పేసర్‌ను గుర్తు చేస్తున్నాడు: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్

Jasprit Bumrah: బుమ్రా పాకిస్థాన్ దిగ్గజ పేసర్‌ను గుర్తు చేస్తున్నాడు: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. తన పదునైన యార్కర్లు, స్వింగ్, బౌన్స్ తో ఎంతటి స్టార్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తాడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు. ఇప్పటికే క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన బుమ్రా..నెంబర్ వన్ బౌలర్ గా కితాబులందుకుంటున్నాడు. తాజాగా బుమ్రా బౌలింగ్ ను ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లంగర్ అతన్ని దిగ్గజ పేసర్ తో పోలుస్తూ కొనియాడాడు. 

ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.." బుమ్రాను నేను ఎదుర్కోవడానికి ఆసక్తి చూపించను. అతను వసీం అక్రమ్ లాంటివాడు. నాకు బుమ్రా వసీం అక్రమ్‌కి రైట్ హ్యాండ్ వెర్షన్. 'మీరు ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ ఎవరు' అనే ప్రశ్న నన్ను అడిగిన ప్రతిసారీ నేను వసీం అక్రమ్ అంటాను. అతను బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. గొప్ప బౌలర్లు మాత్రమే ఇలా చేయగలరు". అని జస్టిన్ లాంగర్ అన్నాడు. 

ALSO READ IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు వైస్ కెప్టెన్లు.. కమ్మిన్స్ లేకపోతే బాధ్యతలు ఎవరికి..?

బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 10.90 సగటుతో 21 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. పెర్త్‌లో ఐదు వికెట్లు.. బ్రిస్బేన్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీలను నాలుగు సార్లు అవుట్ చేశాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో బుమ్రా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.