కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు రోజుకు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ట్రూడోను ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్. ట్రూడో అసమర్థతతోనే దేశంలో ప్రజలు నిత్యవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువతకు అందుబాటులో ఇండ్లు దొరకడం లేదన్నారు. ఇలాంటి సమస్యలను తీర్చాల్సిన ప్రధాని సొంత పార్టీలోనే పోరాడాల్సి వస్తుందన్నారు.
ALSO READ : రష్యాకు విమానంలో 2 వేల కోట్లు తరలించిన సిరియా మాజీ ప్రెసిడెంట్
దీని బట్టే ప్రధానిగా ట్రూడో కొనసాగాల్సిన అవసరం లేదని అర్థం అవుతుందన్నారు జగ్మీత్ సింగ్. ఇక కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సూచన మేరకు తన పదవికి రాజీనామా చేశారు ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్.