కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే రైతు సంక్షేమం: జువ్వాడి నర్సింగరావు

కోరుట్ల, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే రైతుల సంక్షేమం సాధ్యమని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మూతపడ్డ  ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని కోరుట్ల కాంగ్రెస్​ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు అన్నారు. బుధవారం కోరుట్లలోని ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జువ్వాడి నర్సింగరావు నామినేషన్​ పత్రాలు దాఖలు చేశారు.

అనంతరం ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఎమ్మెల్యే  బీఎం నాగరాజుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్​పాలనతో ప్రజలు విసుగుచెందారని, మార్పు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో  కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. లీడర్లు తిరుమల గంగాధర్ , అబ్దుల్ హఫీజ్  తదితరులు పాల్గొన్నారు.