ప్రజల కోసం తపించిన వ్యక్తి రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు

ప్రజల కోసం తపించిన వ్యక్తి రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు
  • ఐటీ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు
  • కోరుట్లలో జువ్వాడి రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు విగ్రహావిష్కరణ
  • హాజరైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

జగిత్యాల, వెలుగు : ప్రజా సేవ కోసం నిరంతరం తపించి, పదవులకే వన్నె తెచ్చిన నేత జువ్వాడి రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు అని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు కొనియాడారు. జగిత్యాల జిల్లా కోరుట్ల వెటర్నరీ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు విగ్రహాన్ని ఆయన కుమారులు నర్సింగరావు, కృష్ణారావు, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వినోద్, సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్సీలు జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, భానుప్రసాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు మాట్లాడుతూ రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు భావి తరాలకు దశ, దిశ నిర్ధేశించి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ధూపదీప నైవేద్య కార్యక్రమం, కోరుట్లలో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌లు ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ 1989 – 90లో రెండు ఆకుల గుర్తుపై గెలిచి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.

రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టడమే ఆయనకు ఇచ్చే నివాళి అని అన్నారు. ఎంపీ చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ జువ్వాడి ప్రజలతో మమేకమైన విధానాన్ని యువనేతలు స్ఫూర్తిగా తీసుకోవాలనిసూచించారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లు, ఏఎంసీ చైర్మన్లు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు పాల్గొన్నారు.

కాకాతో కలిసి రజాకార్లపై పోరాటం

దివంగత నేత రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు కాకాతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గుర్తు చేశారు. వ్యాపారంలో క్రమశిక్షణగా పనిచేయాలని సూచించే వారన్నారు. రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు విగ్రహం ఏర్పాటు ఆనందంగా ఉందన్నారు. పదేండ్లు రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావుతో ఉన్న జ్ఞాపకాలు  గుర్తుకు వస్తున్నాయన్నారు. రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు ఆశయాలను నర్సింగరావు, కృష్ణారావు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.